నెట్‌ఫ్లిక్స్‌లో మిస్టర్ బచ్చన్.. ఎప్పటి నుంచంటే...

September 07, 2024


img

హరీష్ శంకర్‌ దర్శకత్వంలో మాస్ మహరాజ్ రవితేజ, బాలీవుడ్‌ నటి భాగ్యశ్రీ బోర్సే జంటగా చేసిన ‘మిస్టర్ బచ్చన్’ సినిమా ఆగస్ట్ 15వ తేదీన థియేటర్లలో విడుదలైంది. కానీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దర్శకుడు హరీష్ శంకర్‌ మాస్ ఆడియన్స్ పల్స్ బాగా తెలిసిన వ్యక్తి. కనుక ఆయన దర్శకత్వంలో మాస్ మహరాజ రవితేజతో సినిమా అనగానే భారీగా అంచనాలు పెరిగిపోయాయి. సినిమాకి మిశ్రమ స్పందన రావడానికి బహుశః ఇదీ ఓ కారణం అయ్యుండవచ్చు. 

ఇప్పుడు ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చేందుకు సిద్దం అవుతోంది. ఈ నెల 12 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళ్, కన్నడ, మళయాళం భాషల్లో ప్రసారం కాబోతోంది. కనుక ఓటీటీ ప్రేక్షకులు కూడా ఈ సినిమా చూసి ఏవిదంగా ఉందో తీర్పు చెప్పేస్తే అక్కడితో ‘మిస్టర్ బచ్చన్’ సినిమా 'ఆర్చివ్స్'లోకి వెళ్లిపోతుంది.


Related Post

సినిమా స‌మీక్ష