దర్శకుడు ప్రశాంత్ వర్మ చెప్పిన్నట్లుగానే నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ తేజని సినీ పరిశ్రమకి హీరోగా పరిచయం చేయబోతున్నారు. కొద్ది సేపటి క్రితమే నందమూరి మోక్షజ్ఞ పోస్టర్ సోషల్ మీడియాలో విడుదల చేశారు.
“నందమూరి మోక్షజ్ఞకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ అతనిని హీరోగా పరిచయం చేయడం చాలా సంతోషంగా గౌరవంగా భావిస్తున్నానని ప్రశాంత్ వర్మ ట్వీట్ చేశారు. పీవీ (ప్రశాంత్ ప్రశాంత్ వర్మ)సినిమాటిక్ యూనివర్స్‌లోకి స్వాగతం అంటూ తనపై ఎంతో నమ్మకం ఉంచి ఆశీర్వదించినందుకు ప్రశాంత్ వర్మ నందమూరి బాలకృష్ణకి కృతజ్ఞతలు తెలుపుకొన్నారు.