హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా దర్శకుడుగా ఎదిగిన ప్రశాంత్ వర్మ దాని తర్వాత జైహనుమాన్ అనే మరో సినిమా మొదలుపెట్టాడు. ఈలోగా దాని తర్వాత చేయబోయే మరో సినిమాకి సంబందించి ఆసక్తికరమైన విషయం చెప్పబోతున్నాడు.
నాలుగు రోజుల క్రితం ‘లయన్ కింగ్’ సినిమా పోస్టర్‌తో ‘సింబా ఈజ్ కమింగ్’ అంటూ అందరి దృష్టిని ఆకర్షించిన ప్రశాంత్ వర్మ, ఇవాళ్ళ ఉదయం 10.36 గంటలకి ఆ సినిమాకి సంబందించి వివరాలు తెలియజేస్తానని తన ఇన్‌స్టాగ్రామ్‌లో తెలియజేశాడు.
ఆ సినిమాలో నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞని పరిచయం చేయబోతున్నట్లు ఇప్పటికే చూచాయగా చెప్పేశాడు. నేడు (సెప్టెంబర్ 6) మోక్షజ్ఞ పుట్టిన రోజు కావడంతో ప్రశాంత్ వర్మ ఆ సినిమా గురించి వివరాలు తెలియజేయబోతున్నాడు.
మోక్షజ్ఞ సినీ ప్రవేశం గురించి చాలా కాలంగానే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాస్త ఆలస్యమైనా ప్రశాంత్ వర్మ వంటి అద్భుతమైన దర్శకుడి ద్వారా మోక్షజ్ఞ పరిచయం అవుతుండటం చాలా మంచి నిర్ణయమే అని చేపోచ్చు. మరికొద్ది సేపటిలో ప్రశాంత్ ప్రశాంత్ వర్మ-మోక్షజ్ఞ సినిమా గురించి వివరాలు ఇక్కడే చూడవచ్చు.