అర్జున్ సర్కార్... చాలా డేంజర్!

September 05, 2024


img

శైలేష్ కొలను దర్శకత్వంలో ‘హిట్’ ఫస్ట్ కేస్, సెకండ్ కేస్ పేరుతో విడుదలైన రెండు సినిమాలు తెలుగు సినీ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి.

సినిమాలు హిట్ అయితే దానికి సీక్వెల్, ప్రీక్వెల్ రావడం సహజమే. కానీ తొలి సినిమాతోనే కేస్-1,2,3,4 అంటూ తీస్తుండటం చూసినప్పుడు సినిమాలను ఈవిదంగా కూడా తీయవచ్చా? అని అనిపించకమానదు.

తాజాగా హిట్ సిరీస్‌లో కేస్-3గా వస్తున్న సినిమాలో నాని ఓ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. ఆ సినిమాలో నాని పాత్రని పరిచయం చేస్తూ పోలీసుగా తక్కువ క్రిమినల్‌గా ఎక్కువ అర్జున్ సర్కార్ ఛార్జ్-షీట్‌ తీసుకున్నాడు,” అని క్యాప్షన్ ఇచ్చారు. 

ఫస్ట్ గ్లిమ్స్‌లో నానిని పరిచయం చేసిన విధానం కూడా అద్భుతంగా ఉంది. ‘మీవాడు ప్రమాదంలో పడతాడు ఇటు రావద్దని చెప్పండని’ ఓ అధికారికి ఫోన్‌ కాల్ వస్తే, ‘అతనే ఓ ప్రమాదం’ అని జవాబు చెప్తాడు. ఆ తర్వాత నాని స్టయిల్‌గా సిగార్ కాలుస్తుంటే, సీటు వెనుక రక్తం మరకలు అంటుకున్నా పోలీస్ యూనిఫారంని చూపించడం ద్వారా నాని గురించి ఏమీ చెప్పకుండానే అంతా తెలియజెప్పారు దర్శకుడు శైలేశ్ కొలను. 

ఈ సినిమా నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా, యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై ప్రశాంత్ తీపిర్నేని నిర్మిస్తున్నారు.

ఈ సినిమాకి కధ, దర్శకత్వం: శైలేష్ కొలను, సంగీతం: మిక్కీ జె మేయర్, కెమెరా: సను జాన్ వర్గీస్, ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్ చేస్తున్నారు.

ఈ సినిమా 2025, మే 1వ తేదీన విడుదల చేయబోతున్నట్లు ఫస్ట్ గ్లిమ్స్‌లోనే వెల్లడించారు. 

        


Related Post

సినిమా స‌మీక్ష