సింబా ఈజ్ కమింగ్: ప్రశాంత్ ప్రశాంత్ వర్మ!

September 03, 2024


img

హనుమాన్ సినిమాతో యావత్ దేశం, ప్రపంచదేశాల దృష్టిని ఆకర్షించిన దర్శకుడు దాని తర్వాత ‘జైహనుమాన్’ అనే సినిమా తీయబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అప్పటి నుంచి ఆ సినిమాకి సంబందించి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. కానీ తాజాగా ఎక్స్‌లో పోస్ట్ చేసిన ఓ ఫోటో, దానికి జోడించిన క్యాప్షన్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. 

త్వరలో విడుదలకాబోతున్న ది లయన్ కింగ్ సినిమాలో సింబాని కొత్తయువరాజుగా పరిచయం చేస్తున్న పోస్టర్‌ని పెట్టి దానికి “ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివ ర్స్‌లో ఓ సరికొత్త ఉదయం ప్రారంభం కాబోతోంది,” అని క్యాప్షన్ జోడించారు. 

అంటే తెలుగు సినీ పరిశ్రమలో ఓ రారాజు కుమారుడుని హీరోగా ప్రశాంత్ వర్మ పరిచయం చేయబోతున్నట్లు సూచించిన్నట్లు అర్దమవుతోంది. ఆ సినీ రాకుమారుడు నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ అని టాక్. అవునో కాదో త్వరలో తెలుస్తుంది. 



Related Post

సినిమా స‌మీక్ష