గోపీ చంద్ కావ్య థాపర్ జంటగా శ్రీను వైట్ల దర్శకత్వంలో వస్తున్న విశ్వం సినిమా టీజర్ నేడు విడుదలైంది. టీజర్‌లో కాస్త కామెడీ... మరికాస్త యాక్షన్ సమానపాళ్ళలో భలే ఉంది. నరేష్, ప్రగతి, వెన్నెల కిషోర్, శ్రీకాంత్ అయ్యంగార్, రాహుల్ రామకృష్ణ, పృధ్వీ, ముకేష్ రిషి, జీషు సేన్ గుప్తా తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. టీజర్‌లో ప్రతీ ఒక్కరూ అదరగొట్టేశారు. కనుక ఈ సినిమాలో గోపీచంద్ కామెడీ.. టైమింగ్ సినిమాని హిట్ చేస్తుందా యాక్షన్ సీన్స్ నిలబెడతాయో చూడాల్సిందే.
ఈ సినిమాకి కధ: గోపీ మోహన్, భాను- నాయుడు, ప్రవీణ్ వర్మ, స్క్రీన్ ప్లే: గోపీ మోహన్, సంగీతం: చైతన్ భరద్వాజ్, కెమెరా: కేవీ గుహన్, స్టంట్స్: రవి వర్మ, దినేష్ సుబ్బరాయన్, ఎడిటింగ్: అమర్ రెడ్డి కుడుముల, ఆర్ట్: కిరణ్ కుమార్ మన్నే చేస్తున్నారు.
దోనెపూడి చక్రపాణి సమర్పణలో టీజీ విశ్వప్రసాద్ , వేణుస్వామి దోనెపూడి కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయ స్టూడియోస్ బ్యానర్లపై నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.