భారీ వర్షాలు, వరదలతో అల్లాడుతున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సినీ పరిశ్రమలో ప్రముఖులు విరాళాలు అందజేస్తున్నారు.
యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్ ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి చెరో రూ.50 లక్షలు చొప్పున మొత్తం కోటి రూపాయలు విరాళం ఇస్తున్నట్లు ఎక్స్ (ట్విట్టర్) ద్వారా తెలియజేశారు. వరద బాధితులను ఆదుకునేందుకు రెండు ప్రభుత్వాలు చేస్తున్న సహాయ కార్యమాలకి నావంతుగా సాయపడాలని చెరో రూ.50 లక్షలు విరాళం ఇస్తున్నట్లు జూ.ఎన్టీఆర్ దానిలో పేర్కొన్నారు.
విశ్వక్ సేన్ ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయనిధికి చెరో రూ.5 లక్షలు విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు.
వైజయంతీ మూవీస్ అధినేత అశ్వీనీ దత్ ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.250 లక్షలు విరాళం ప్రకటించారు. నిన్న సోమవారం నుంచి శనివారం వరకు కల్కి ఎడి2898 సినిమా కలెక్షన్లలో నిర్మాత వాటాగా వచ్చే దానిలో 25 శాతం జనసేన పార్టీ తరపున ఏపీ ప్రభుత్వానికి విరాళంగా ఇస్తామని ప్రక్టించారు. మరి తెలంగాణకు ఎంత ఇస్తారో చూడాలి.
ఇంకా చిరంజీవి, నాగార్జున, మహేష్ బాబు, అల్లు అర్జున్ తదితరులు విరాళాలు ప్రకటించలేదు. ఎవరెవరు ఎంతిస్తారో... ఎప్పుడిస్తారో?