కాంతారకి నేను రెడీ: జూ.ఎన్టీఆర్‌

September 01, 2024


img

రెండేళ్ళ క్రితం రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో ఆయన స్వీయ దర్శకత్వంలో వచ్చిన ‘కాంతార’ సినిమా ఎంత సూపర్ హిట్ అయ్యిందో అందరూ చూశారు. కేవలం రూ.16 కోట్లతో చిన్న సినిమాగా ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి సూపర్ డూపర్ హిట్ అయ్యింది. అది సుమారు రూ.450 కోట్లు కలక్షన్స్‌ రాబట్టింది. అటువంటి సినిమాలో అవకాశం వస్తే ఎవరైనా వదులుకుంటారా? జూ.ఎన్టీఆర్‌ అయినా వదులుకోరు. 

ప్రస్తుతం కుటుంబ సమేతంగా జూ.ఎన్టీఆర్‌, దర్శకుడు ప్రశాంత్ నీల్, రిషబ్ శెట్టిలతో కలిసి కర్ణాటకలో ప్రసిద్ద ఆలయాలు సందర్శిస్తున్నారు. ఆదివారం కొల్లూరులో మూకాంబిక అమ్మవారిని దర్శించుకుని బయటకు వచ్చిన తర్వాత మీడియా ప్రతినిధులు ‘కాంతార-3 ’ (ప్రీక్వెల్) నటించబోతున్నారా రిషబ్ శెట్టితో కలిసి వచ్చారు? అని ప్రశ్నించగా, “ఈ విషయం రిషబ్ శెట్టే నిర్ణయించాలి. ఆయన ప్లాన్ చేసి అవకాశం ఇస్తే తప్పకుండా నటిస్తాను,” అని జూ.ఎన్టీఆర్‌ జవాబు చెప్పారు. 

నిప్పు లేనిదే పొగరాదన్నట్లు జూ.ఎన్టీఆర్‌, రిషబ్ శెట్టిలకు అటువంటి ఆలోచన ఏదో ఉండే ఉంటుందని అందరూ భావిస్తున్నారు. అందుకే అడగగానే జూ.ఎన్టీఆర్‌ ఒకే చెప్పేశారని భావిస్తున్నారు. కానీ జూ.ఎన్టీఆర్‌ చెప్పిన ఈ సమాధానం అభిమానులకు చాలా సంతోషం కలిగిస్తోంది.

ఆ సినిమాలో నటించిన రిషబ్ శెట్టికి ఉత్తమ నటుడుగా జాతీయ అవార్డు లభించింది. అటువంటి సినిమా, అటువంటి పాత్రని జూ.ఎన్టీఆర్‌ అవలీలగా చేయగలరు. కనుక కాంతర-3లో తప్పక చేయాలని కోరుకుంటున్నారు.

ప్రస్తుతం రిషబ్ శెట్టి కాంతార- చాప్టర్1తో బిజీగా ఉండగా జూ.ఎన్టీఆర్‌ దేవరతో బిజీగా ఉన్నారు. కనుక అవి పూర్తిచేస్తే ఇద్దరూ ఒకేసారి ఖాళీ అవుతారు కనుక కాంతార-3 మొదలుపెట్టినా ఆశ్చర్యం లేదు.


Related Post

సినిమా స‌మీక్ష