కల్కి ఎడి2898 సూపర్ డూపర్ హిట్‌ని తన ఖాతాలో వేసుకున్న ప్రభాస్, ప్రస్తుతం మారుతితో ‘ది రాజాసాబ్’ క్రైమ్ కామెడీ చేస్తున్నారు. ఇప్పటికే 60 శాతంపైగా షూటింగ్ పూర్తయింది. కనుక జనవరిలోగా దీనిని ముగించి తర్వాత హనుమాన్ రాఘవపూడితో ‘ఫౌజీ’ మొదలు పెట్టాలనుకున్నారు.
తాజా సమాచారం ప్రకారం సందీప్ వంగాతో ‘స్పిరిట్’ చేయాలనుకొని చాలా కాలమే అయ్యింది కనుక ‘రాజాసాబ్’ పూర్తికాగానే ‘ఫౌజీ’కి బదులు ‘స్పిరిట్’ మొదలుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది.
సందీప్ వంగా చేతిలో స్క్రిప్ట్ రెడీగా ఉంది. కనుక జనవరి లేదా ఫిభ్రవరిలో రాజాసాబ్ పూర్తయేసమయానికి, స్పిరిట్ ప్రీ-ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకొని షూటింగ్ మొదలుపెట్టగలరు. కనుక ముందుగా ‘స్పిరిట్’కి ఎక్కువ డేట్స్ కేటాయించి తర్వాత ‘ఫౌజీ’కి ఇవ్వాలనుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది.
కల్కి-2ని జనవరి-ఫిభ్రవరిలో మొదలుపెడతామని నాగ్ అశ్విన్ చెప్పారు. కానీ ముందు ఫౌజీ, స్పిరిట్ పూర్తి చేసి వచ్చే విజయదశమి నుంచి కల్కి-2 మొదలుపెడితే మద్యలో ఎక్కడా గ్యాప్ తీసుకోకుండా పూర్తి చేసేయవచ్చని ప్రభాస్ టీమ్ తాజా ప్లాన్ అని తెలుస్తోంది.
ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం ప్రభాస్ రాజాసాబ్ తర్వాత ఫౌజీ, స్పిరిట్, కల్కి-2 మూడు సినిమాలు లైన్లో పెట్టారు కనుక కాస్త ముందూ వెనుకగా అన్నీ వరుసగా చేసుకుపోక తప్పదు.