చిరు, పవన్, బాబు, రేవంత్‌, మోడీ లిమిటెడ్ ఎడిషన్స్!

August 31, 2024


img

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ రాజకీయాలలో బిజీ అయిపోవడంతో ఆయన సినిమాల కోసం అభిమానులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. పవన్‌ కళ్యాణ్‌ మూడు సినిమాలు మొదలుపెట్టినప్పటికీ వాటిని పూర్తి చేయలేకపోతున్నారు.

కనుక సెప్టెంబర్‌ 2వ తేదీన పవన్‌ కళ్యాణ్‌ పుట్టినరోజుని పురస్కరించుకొని హరీష్ శంకర్‌ దర్శకత్వంలో ఆయన నటించిన సూపర్ డూపర్ హిట్ ‘గబ్బర్ సింగ్‌’ సినిమా రీ రిలీజ్ చేయబోతున్నారు.

పవన్‌ కళ్యాణ్‌ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న అభిమానులకి ఇది కాస్త ఊరటనిస్తోందని చెప్పవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పటికే థియేటర్లలో టికెట్స్ అన్నీ బుక్ అయిపోయాయి కూడా. 

గబ్బార్ సింగ్‌ రీ-రిలీజ్ సందర్భంగా  ఆ సినిమా దర్శకుడు హరీష్ శంకర్, నిర్మాత బండ్ల గణేశ్ తదితరులు హైదరాబాద్‌లో రీ-రిలీజ్ ఫంక్షన్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండ్ల గణేశ్ ఎప్పటిలాగే చమత్కారంగా మాట్లాడి అందరినీ ఆకట్టుకున్నారు. 

“మా ఫ్రెండ్ ఒకాయన వాచీ పెట్టుకున్నారు. ఎంతని అడిగితే 40 కోట్లు అని చెప్పారు. ఎందుకంత ధర అంటే అది ‘లిమిటెడ్ ఎడిషన్’ అని మళ్ళీ అటువంటి వాచీని మరొకటి తయారు చేయరని చెప్పారు. అలాగే భగవంతుడు కూడా ఓ చిరంజీవి, ఓ పవన్‌ కళ్యాణ్‌, ఓ చంద్రబాబు నాయుడు, ఓ రేవంత్‌ రెడ్డి, ఓ నరేంద్ర మోడీని ‘లిమిటెడ్ ఎడిషన్స్’గా సృష్టించి పంపాడు. కనుక మనం వారిని గౌరవించుకోవాలి,” అని బండ్ల గణేశ్ అన్నారు.


Related Post

సినిమా స‌మీక్ష