శ్రీవిష్ణు, రీతు వర్మ, మీరా జాస్మిన్ ప్రధాన పాత్రలలో స్వాగ్ సినిమా టీజర్ రిలీజ్ అయ్యింది. సోషియో ఫాంటసీ చిత్రంగా వస్తున్న ఈ సినిమాలో సునీల్, రవిబాబు, గోపరాజు రమణ, గెటప్ శ్రీను, దక్ష నాగార్కర్, శరణ్య ప్రదీప్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
మహిళల చేత పరిపాలింపబడే వింజామర వంశ సామ్రాజ్యంలో మగవారికి స్థానం లేదు. అటువంటి సామ్రాజ్యంలో పురుషులకు ప్రాధాన్యం ఇచ్చే శ్వాగణిక వంశానికి చెందిన శ్రీవిష్ణు ‘వేర్ ఈజ్ మై సన్’ అంటూ టీజర్‌లో చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఆనాటి ఈ రెండు వంశాలకు చెందినవారు ఈ యుగంలోకి వస్తే అది మరో కధ. టీజర్ చూస్తే ఈ సినిమాతో శ్రీవిష్ణు తప్పకుండా హిట్ కొట్టబోతున్నట్లే ఉన్నాడు.
ఈ సినిమాకి కధ, దర్శకత్వం: హాసిత్ గోలి, సంగీతం: వివేక్ రామస్వామి సాగర్, కెమెరా: వేదరామన్ శంకరన్, ఆర్ట్: జీఎం శేఖర్, స్టంట్స్: నందు మాస్టర్, ఎడిటింగ్: విప్లవ్, కొరియోగ్రఫీ: శిరీష్ కుమార్ చేశారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాని నిర్మించారు. త్వరలో ఈ సినిమా విడుదల కాబోతోంది.