చేతికి కట్టుతో జూ.ఎన్టీఆర్‌! ఏమైందంటే.

August 14, 2024


img

ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్‌తో చాలా బిజీగా ఉన్న జూ.ఎన్టీఆర్‌ ఎడమ చేతికి కట్టుతో ఉన్న ఓ ఫోటో సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యింది. అంతే... దేవర సినిమా షూటింగ్‌లో జూ.ఎన్టీఆర్‌ గాయపడ్డారంటూ పుకార్లు మొదలైపోయాయి.

వీటిపై జూ.ఎన్టీఆర్‌ టీమ్‌ వెంటనే స్పందిస్తూ, “జూ.ఎన్టీఆర్‌ జిమ్‌లో వర్కవుట్ చేస్తుండగా ఎడమ చేయి మణికట్టు వద్ద కొద్దిగా బెణికింది. దాని వలన మరింత ఇబ్బంది కలగకుండా ఉండేందుకు వైద్యుల సూచన మేరకు జూ.ఎన్టీఆర్‌ ఎడమచేతికి కట్టు వేసుకున్నారు.

కానీ దేవర షూటింగ్‌ సమయంలో దానిని తీసేసి మామూలుగానే నటించారు. చెయ్యి బెణికింది తప్ప మరే సమస్యా లేదు. కనుక అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దయచేసి ఎవరూ దీనిపై పుకార్లు వ్యాపింపజేయవద్దని మనవి చేసుకుంటున్నాము,” అని చెప్పారు. 

కొరటాల శివ దర్శకత్వంలో జూ.ఎన్టీఆర్‌, జాన్వీ కపూర్‌ జంటగా చేస్తున్న దేవర సినిమా షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. తాజాగా ఓ పాట చిత్రీకరించారు. రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా మొదటి భాగం సెప్టెంబర్‌ 27న ప్రపంచవ్యాప్తంగా 5 భారతీయ భాషల్లో విడుదల కాబోతోంది.


Related Post

సినిమా స‌మీక్ష