డబుల్ స్మార్ట్ టికెట్‌ ధర పెంపు మంచిదేనా?

August 14, 2024


img

పూరీ జగన్నాధ్ స్వీయదర్శకత్వంలో నిర్మించిన డబుల్ స్మార్ట్ సినిమా రేపు (ఆగస్ట్ 15) స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదల కాబోతోంది.ఈ సినిమాలో  రామ్ పోతినేని, కావ్యా థాపర్ జంటగా నటించారు. ఈ సినిమా టికెట్‌ ధర రూ.35 చొప్పున పెంచుకునేందుకు ఆమోదం తెలుపుతూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రేపటి నుంచి మొదటి పది రోజులు టికెట్‌ ఛార్జీ పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. 

లైగర్ దెబ్బతో చాలా నష్టపోయిన పూరీ జగన్నాథ్ ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాకు సీక్వెల్‌గా తీస్తున్న ఈ సినిమాతో మళ్ళీ పుంజుకోవాలనే ప్రయత్నంలో భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా దీనిని 5 భాషల్లో నిర్మించారు. కనుక పెట్టుబడి రాబట్టుకోవడానికి టికెట్‌ ఛార్జ్ పెంచుకోవాలనుకోవడం తప్పు కాదు.

ఈ సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’ కంటే ఇంకా అద్భుతంగా ఉంటే టికెట్‌ ధర పెంచినా ప్రేక్షకులు తప్పక చూస్తారు. కానీ ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో పోల్చుకొని ప్రేక్షకులు థియేటర్లకు వస్తారు కనుక వారి అంచనాలకు తగ్గితే మళ్ళీ పూరీ జగన్నాధ్ నష్టపోయే ప్రమాదం ఉంటుంది.   

ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నారు. అలీ, షాయాజీ షిండే, మకరంద్ దేశ్ పాండే, టెంపర్ వంశీ, గెటప్ శ్రీను తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: పూరీ జగన్నాధ్, పాటలు: భాస్కరభట్ల, సంగీతం: మణిశర్మ, కొరియోగ్రఫీ: జానీ మాస్టర్, కెమెరా: శ్యామ్ కె నాయుడు, జియాణీ జియానెల్లి, ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్,  చేస్తున్నారు. 

పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై పూరీ జగన్నాధ్, ఛార్మీ కౌర్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్ట్ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.

  



Related Post

సినిమా స‌మీక్ష