వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని, కోలీవుడ్ నటుడు సూర్య ప్రధాన పాత్రలు చేసిన ‘సరిపోదా శనివారం’ సినిమా ట్రైలర్ విడుదలైంది.
ఓ శాడిస్ట్ పోలీస్ అధికారిగా సూర్య, అతనిని ఎదుర్కొనే మద్యతరగతి వ్యక్తిగా నాని నటించిన్నట్లు ట్రైలర్ స్పష్టం చేస్తోంది. కధ కోసం కొంచెం రాజకీయాలు కూడా కలిపినట్లున్నారు. కానీ నాని, సూర్య ఇద్దరూ పోటీ పడి నటించారు. సినిమా కధ ఎలా ఉన్నా వారిద్దరే దానిని హిట్ చేసే అవకాశం ఉంది.
ఈ సినిమాలో నానికి జోడీగా ప్రియాంకా అరుల్ మోహన్, నాని తండ్రిగా సాయి కుమార్ ముఖ్యపాత్రలు చేశారు. మురళీశర్మ, శుభలేఖ సుధాకర్, అజయ్ ఘోష్, హర్ష వర్ధన్, సుప్రీత్ రెడ్డి, అజయ్ గోవర్ధన్ తదితరులు దీనిలో ముఖ్యపాత్రలు చేశారు.
ఈ సినిమాకు సంగీతం: జేక్స్ బిజోయ్, కెమెరా: జి.మురళి, ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్ చేశారు.
డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకి ఆగస్ట్ 29వ తేదీన తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.