అక్కినేని నాగార్జున, ఆయన ఇద్దరు కుమారులు నాగ చైతన్య, అఖిల్ సినిమాలలో నటిస్తున్నారు. ఇప్పుడు వారింట్లో అక్కినేని కోడలుగా అడుగుపెట్టబోతున్న శోభిత ధూళిపాళ కూడా సినిమాలలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కనుక నలుగురూ సినిమాల ద్వారా బాగానే ఆదాయం సంపాదిస్తున్నారని వేరే చెప్పక్కరలేదు.
సినిమాల ద్వారానే కాక వారికి ఇతర మార్గాల ద్వారా భారీగా ఆదాయం సమకూరుతూనే ఉంటుంది. నిర్మాతలు వారి సినిమాలపై భారీగా పెట్టుబడి పెడుతుంటారు.
నాగ చైతన్య ఒక్కో సినిమాకు రూ.5 నుంచి 10 కోట్లు పారితోషికం అందుకుంటున్నారని కానీ శోభిత ధూళిపాళ రూ.70 లక్షల నుంచి కోటి వరకు తీసుకుంటున్నారని ఇండియా టుడే తెలియజేసింది.
నాగ చైతన్య తొలిసారిగా చేసిన 'దూత' వెబ్ సిరీస్‌కు సుమారు రూ.8 కోట్లు పారితోషికం అందుకున్నారని తెలిపింది. బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ హీరోగా చేసిన లాల్ సింగ్ చద్దా సినిమాలో నటించినందుకు నాగ చైతన్య రూ.50 లక్షలు పారితోషికం పొందారని ఇండియా టుడే తెలిపింది.
వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకొని ఆదాయ పరంగా వారి ఒక్కొక్కరి విలువ ఎంత?అని లైఫ్ స్టైల్ ఆసియా, ఆసియా న్యూస్ అధ్యయనం చేసి నివేదిక ప్రకటించాయి. వాటి ప్రకారం నాగార్జున ఆర్ధిక విలువ రూ.3,100 కోట్లు అని తెలిపింది.
నాగ చైతన్య ఆర్ధిక విలువ సుమారు రూ.154 కోట్లు కాగా శోభిత ధూళిపాళ ఆర్ధిక విలువ మాత్రం కేవలం రూ.7 నుంచి 10 కోట్ల లోపే ఉంటుందని తెలిపింది. దక్షిణాది రాష్ట్రాలలో అత్యంత ధనవంతులైన సినీ నటులలో నాగార్జున కూడా ఒకరని తెలిపింది.