బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌-8 ప్రమో అదిరిపోయిందిగా

August 11, 2024


img

స్టార్ మా తెలుగు ఛానల్లో నాగార్జున హోఫ్ట్‌గా బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌-8 త్వరలో ప్రారంభం కాబోతోంది. దాని ప్రమో నేడు విడుదలైంది. ప్రమోలో నాగార్జున డ్యాన్స్‌తో అదరగొట్టేయగా సత్య తనదైన శైలిలో కామెడీ అదరగొట్టేశాడు. 

అయితే నాగార్జున వయసు పెరుగుతోంది కనుక ఆయనలో ఇదివరకటి ఛార్మ్, హుషారు కనపడలేదనిపిస్తుంది ఈ సీజన్‌ గురించి ఆయన ఇంట్రడక్షన్ ఇచ్చినప్పుడు. 

ఈ సీజన్‌లో వినోదం, ట్విస్టులు ఉంటాయని చెపుతూ ఓ శాంపిల్ చూపారు. దానిలో నాగార్జున సత్యని ‘నీకు ఏం కావాలి?’ అని అడిగితే తన చుట్టూ ఉన్న అందమైన అమ్మాయిలని చూసి మురిసిపోతూ ‘ఏకాంతం కావాలని’ అడుగుతాడు.

“ఏదైనా అడిగేటప్పుడు బాగా ఆలోచించి అడుగు” అని నాగార్జున హెచ్చరించినా సత్య నాకు ఏకాంతమే కావాలంటాడు. ‘అయితే తీస్కో...’ అనగానే చిరిగిన బనియన్, లుంగీతో ఎడారి మద్య పడతాడు... దాంతో “సత్య ‘నేను ఎక్కడ ఉన్నాను... హలో ఎవరైనా ఉన్నారా?” అంటూ అడగడం అందరినీ నవ్విస్తుంది.  

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌-8 ప్రమో అదిరిపోయింది. ఈ సీజన్‌లో నిఖిల్, రాజ్‌తరుణ్‌, బంచిక్ బబ్లూ, సద్దాం, శివ, శ్వేత నాయుడు, తేజస్వినీ గౌడ, దీపికా,  తదితరులు  పార్టిసీపెంట్స్ ఉండబోతున్నారు. ఆగస్ట్ 25వ తేదీ నుంచి ఈ షో మొదలవబోతోంది.

 


Related Post

సినిమా స‌మీక్ష