చిరంజీవి, బాలకృష్ణ కలిస్తే మామూలుగా ఉండదుగా

August 10, 2024


img

ఆహా ఓటీటీలో నందమూరి బాలకృష్ణ హోస్టింగ్ చేసిన అన్‌స్టాపబుల్ రెండు సీజన్లకు ప్రేక్షకుల మంచి ఆదరణ లభించడంతో త్వరలో మూడో సీజన్‌కి సిద్దమవుతున్నారు. అక్టోబర్ 10వ తేదీ నుంచి అన్‌స్టాపబుల్ సీజన్‌లో-3 ప్రారంభం కాబోతోంది.  

గత సీజన్‌లో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్య అతిధిగా వచ్చారు. ఎప్పుడూ గంభీరంగా ఉండే చంద్రబాబు నాయుడుని బాలయ్య చిలిపి ప్రశ్నలు వేస్తారని ఎవరూ అనుకోలేదు. అలాగే ఆయన కూడా చిలిపిగా సమాధానాలు చెప్తారని ఎవరూ అనుకోలేదు. కానీ ఇద్దరూ కాస్త చిలిపిగా మాట్లాడటంతో ఆ షో చాలా రక్తి కట్టింది. ప్రేక్షల నుంచి దానికి అద్భుతమైన స్పందన వచ్చింది. 

ఈసారి తొలి షోలో మెగాస్టార్ చిరంజీవి, ఆయనతో పాటు అక్కినేని నాగార్జున కూడా పాల్గొబోతున్నట్లు సమాచారం. ఒకేసారి ముగ్గురు సీనియర్ హీరోలు షోలో పాల్గొంటే ఇక వేదిక దద్దరిల్లిపోవలసిందే. త్వరలోనే అన్‌స్టాపబుల్ సీజన్‌లో-3కి సంబందించి అధికారిక ప్రకటన వెలువడబోతోంది. దానిలో ఈ మూడో సీజన్‌లో ఇంకా ఎవరెవరు పాల్గొనబోతున్నారో ప్రకటించే అవకాశం ఉంది.


Related Post

సినిమా స‌మీక్ష