నాగశౌర్య హీరోగా శ్రీవైష్ణవి ఫిలిమ్స్ బ్యానర్‌పై శ్రీనివాసరావు చింతలపూడి తన తొలి సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు దర్శకుడు కూడా కొత్తవాడే కావడం విశేషం. రామ్ దేశీన ఈ సినిమాతో దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు.
నేటి నుంచే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైందని తెలియజేస్తూ నిర్మాణ సంస్థ పూజా కార్యక్రమానికి సంబందించి కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది.
ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్, సాయికుమార్, సముద్రఖని, వెన్నెల కిషోర్, భ్రహ్మాజీ, పృధ్వీ, అజయ్, కృష్ణుడు, చమక్ చంద్ర, మైమ్ గోపి, శ్రీదేవి విజయ్ కుమార్, శివన్నరాయణ ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకి సంగీతం: హారిస్ జయరాజ్, కెమెరా: రసూల్ ఎల్లోర్, ఆర్ట్: రాజీవ్ నాయర్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు చేస్తున్నారు.