కమల్ హాసన్ జీవితంలో అనేక సినిమాలు చేశారు. వాటిలో చాలా వరకు సూపర్ హిట్లే. కొన్ని ఫ్లాప్ అయినా అవి ఆయన కెరీర్‌పై ఎటువంటి ప్రభావం చూపలేదు. కానీ ఇంత సీనియర్ నటుడుకి ఈ దశలో ఓ సినిమా అట్టర్ ఫ్లాప్ అయితే తప్పకుండా చాలా నామోషీగా ఉంటుంది.
శంకర్ దర్శకత్వంలో ఏళ్ళ తరబడి తీసిన భారతీయుడు-2 ఫ్లాప్ అవడంతో కమల్ హాసన్ ఇప్పుడు అలాగే ఇబ్బంది పడుతున్నారు. జూలై 12న భారీ అంచనాల మద్య ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకి మొదటి రోజు నుంచే నెగెటివ్ టాక్ వచ్చింది. కనుక ఎవరూ దానిపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఇప్పుడు ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి వచ్చేసింది. నేటి నుంచే తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో ప్రసారం అవుతోంది.
థియేటర్లలో ఈ సినిమాని చూడలేకపోయిన కమల్ హాసన్ అభిమానులు ఇప్పుడు హాయిగా ఇంట్లో కూర్చోనే చూడవచ్చు.