ఎన్టీఆర్‌, నీల్ సినిమాకి కొబ్బరికాయ కొట్టేశారు

August 09, 2024


img

ప్రస్తుతం కొరటాల శివతో దేవర చేస్తున్న జూ.ఎన్టీఆర్‌, తర్వాత ప్రశాంత్ నీల్‌తో సినిమా చేయబోతున్నారు. ఆ సినిమా ప్రకటన ఎప్పుడో చేసినా ఇన్నాళ్ళకు శుక్రవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమం చేసి కొబ్బరికాయ కొట్టేశారు. దేవర నుంచి బయటకు రాగానే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ మొదలుపెట్టబోతున్నారు. 

జూ.ఎన్టీఆర్‌ 31వ సినిమాగా చేయబోతున్న ఈ సినిమాకి ‘డ్రాగన్’ అని పేరు ఖరారు చేసిన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా పూజా కార్యక్రమానికి జూ.ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులు హాజరవడం విశేషం. ఈ సినిమాలో జూ.ఎన్టీఆర్‌కి జోడీగా రష్మిక పేరు ఖరారు చేసిన్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్ బ్యానర్లపై నవీన్ ఎర్నేని, రవిశంకర్ నిర్మించబోతున్నారు. కళ్యాణ్ రామ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 2026, జనవరి 9వ తేదీన ఈ సినిమా విడుదల చేయబోతున్నట్లు సినిమా పూజా కార్యక్రమంలోనే ప్రకటించారు.



Related Post

సినిమా స‌మీక్ష