నాగ చైతన్య, సమంత విడిపోయి దాదాపు రెండేళ్ళవుతోంది. ఆ తర్వాత నాగ చైతన్య నటి శోభిత ధూళిపాళతో ప్రేమలో పడ్డారు. వారిద్దరూ కలిసి తిరుగుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వస్తూనే ఉన్నాయి. కనుక వారి పెళ్ళి చేసుకోబోతున్నారనే ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి.
వాటిని నిజం చేస్తూ నేడు హైదరాబాద్‌లో నాగార్జున ఇంట్లో ఇరు కుటుంబాలు భోజన సమావేశం కాబోతున్నాయి. వారి వివాహ నిశ్చితార్దం, పెళ్ళిని ఖరారు చేయడానికే వారు నేడు సమావేశం కాబోతున్నారని తెలుస్తోంది. కనుక అక్కినేని అభిమానులు అందరూ అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు.
శోభిత దూళిపాళ 2013లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్ గెలుచుకొని అందరి దృష్టిలో పడ్డారు. మూడేళ్ళ తర్వాత సినీ పరిశ్రమలో ప్రవేశించి తెలుగు, హిందీ సినిమాలు చేస్తున్నారు.
ఇక నాగ చైతన్య ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో సాయి పల్లవితో కలిసి 'తండేల్' సినిమా చేస్తున్నారు.
నాగ చైతన్య నుంచి విడిపోయిన సమంత చాలా మానసిక క్షోభ అనుభవించారు. తర్వాత కోలుకొని మళ్ళీ సినిమాలలో నటించడం మొదలుపెట్టేసరికి ఆమెకు ‘మయోసైటిస్’ అనే అరుదైన వ్యాధిన పడ్డారు.
ఆ వ్యాధితో బాధపడుతూనే యశోద, శాకుంతలం, ఖుషీ మూడు సినిమాలు చేశారు. వాటిలో యశోద తప్ప మిగిలిన రెండూ ఆమెకు నిరాశనే మిగిల్చాయి. వైవాహిక జీవితంలో ఎదురుదెబ్బ తిన్నాక ఓ పక్క వ్యాధి, మరోపక్క సినీ కెరీర్‌లో ఈ ఎదురుదెబ్బలతో సమంత సతమవుతూనే ఉన్నారు. సమంత పరిస్థితి దయనీయంగా మారుతుండగా, నాగ చైతన్య జీవితం మళ్ళీ గాడిన పడుతోంది.