మిస్టర్ బచ్చన్ ట్రైలర్‌... రవితేజ మళ్ళీ దంచేశాడుగా!

August 08, 2024


img

మాస్ మహరాజ్ రవితేజ ఎన్ని కమర్షియల్ సినిమాలు చేస్తున్నా ప్రతీసారి కొత్తగానే ఉంటుంది. సరైన కధ, దర్శకుడు దొరికితే రవితేజ ఎలా చెలరేగిపోతాడో మిస్టర్ బచ్చన్ ట్రైలర్‌ చూస్తే అర్దమవుతుంది. 

ఈ సినిమాలో రవితేజ బాలీవుడ్‌ సీనియర్ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ అభిమాని, ఇన్‌కమ్ టాక్స్ ఆఫీసరుగా నటించాడు. ఈ రెండు మాస్ ఎలిమెంట్స్ ఉన్నవే కనుక రవితేజ అదరగొట్టేశాడు. 

కధ చాలా పాతదే అని తెలుస్తూనే ఉంది. ట్రైలర్‌లో రవితేజ మార్క్ పంచ్ డైలాగులు, ఫైట్స్, హీరోయిన్‌తో రొమాన్స్, కామెడీ అన్నీ షరా మామూలే. 

కానీ రవితేజ, దర్శకుడు హరీష్ శంకర్‌ ఇద్దరూ కలిసి ప్రేక్షకులను రంజింపజేయబోతున్నారని ట్రైలర్‌ చూస్తే అర్దమవుతుంది. అలాగే ఈ సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌, షోలే సినిమాని బాగానే వాడేసుకున్నట్లున్నారు. 

అలాగే దర్శకుడు హరీష్ శంకర్‌ చాలా తెలివిగా సోషల్ మీడియాలో తన గురించి చెడుగా దుష్ప్రచారం చేస్తున్నవారికి ట్రైలర్‌లో ‘పనీపాటు లేని పకోడీగాళ్ళు...’ అంటూ రవితేజ చేత ఓ డైలాగ్‌తో జవాబు చెప్పించారు.      

ఈ సినిమాలో రవితేజకు జోడీగా బాలీవుడ్‌ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే నటిస్తుండగా జగపతిబాబు విలన్‌గా చేస్తున్నారు. 

ఈ సినిమాకు సంగీతం: మిక్కీ జె.మేయర్, కెమెరా: అయాంక బోస్, ఎడిటింగ్: ఉజ్వల్ కులకర్ణి, ఫైట్స్: రామ్ లక్ష్మణ్‌, పృధ్వీ, స్క్రీన్ ప్లే రైటర్స్: రమేశ్ రెడ్డి, స్టీష్ వెగ్నేశ, ప్రవీణ్ వర్మ, దత్తాత్రేయ, తన్వీ కేసరి, వీఎఫ్ఎక్స్: డెక్కన్ డ్రీమ్స్.      

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, పనోరమ స్టూడియోస్, టీ సిరీస్ స్టూడియోస్ బ్యానర్లపై టిజి విశ్వప్రసాద్, వివేక్‌ అగ్నిహోత్రి కూచిబొట్ల కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మిస్టర్ బచ్చన్ ఆగస్ట్ 15వ తేదీన ప్రేక్షకులను థియేటర్లలో పలకరించబోతున్నాడు. 




Related Post

సినిమా స‌మీక్ష