మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా కొత్త దర్శకుడు ముళ్ళపూడి రవితేజ దర్శకత్వంలో చేస్తున్న ‘మెకానిక్ రాఖీ’ సినిమా నుంచి గుల్లేడు గుల్లేడు గులాబీలు అంటూ సాగే లిరికల్ సాంగ్ ఈరోజు విడుదలైంది. సుద్దాల అశోక్ తేజ వ్రాసిన ఈ పాటని జెక్స్ బెజోయ్ స్వరపరచగా మంగ్లీ సుమధురంగా పాడారు. అయితే ఈ పాట, బీట్, డాన్స్ కంపోజిషన్ అన్ని ఎప్పుడో విన్నట్లు, చూసిన్నట్లు అనిపించక మానదు.
ఈ సినిమాలో విశ్వక్ సేన్‌కు జోడీగా మీనాక్షీ చౌదరి నటిస్తోంది. సిద్ధార్థ్ శ్రీనాథ్, సునీల్, నరేశ్, హైపర్ ఆడీ, హర్షవర్ధన్, వివా హర్ష, రఘురాం తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
మెకానిక్ రాఖీ దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాకి కధ, దర్శకత్వం: రవితేజ ముళ్ళపూడి, సంగీతం: జేక్స్ బిజోయ్, కెమెరా: మనోజ్ రెడ్డి కాటసాని, యాక్షన్: సుప్రీం సుందర్, కొరియోగ్రఫీ: భాను, యష్, ఎడిటింగ్: అన్వర్ అలీ చేస్తున్నారు. మెకానిక్ రాఖీని ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ్ చరణ్ తాళ్ళూరి నిర్మిస్తున్నారు.