జూ.ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా దేవర సినిమా నుంచి రెండో పాట వచ్చేసింది. చుట్టమ్మల్లే చుట్టేస్తాడే... అంటూ మృధుమధురంగా సాగే ఈ రొమాంటిక్ సాంగ్‌ని రామజోగయ్య శాస్త్రి వ్రాయగా అనిరుధ్ రవిచంద్ర స్వరపరిచగా శిల్పారావు పాడారు. జాన్వీ కపూర్‌కి ఇదే తొలి తెలుగు సినిమా అయినప్పటికీ జూ.ఎన్టీఆర్‌తో కెమిస్ట్రీ బాగానే కుదిరిన్నట్లు ఈ వీడియో సాంగ్ చూస్తే అర్దమవుతుంది.
కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ మొదటి భాగం అక్టోబర్ 10వ తేదీన విడుదల కాబోతోంది. దీనిలో ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, నారాయణ్, రమ్యకృష్ణ, చైత్ర రాయ్, కలైయరసన్, షైన్ టామ్ చాకో తదితరులు దేవరలో ముఖ్య పాత్రలు చేస్తున్నారు. బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నారు.
ఈ సినిమాకు కధ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కొరటాల శివ, సంగీతం: అనిరుధ్ రవిచంద్ర, కెమెరా:ఆర్. రత్నవేలు, స్టంట్ డైరెక్టర్ కెన్నీ బెట్స్, ఎడిటింగ్: ఏ. శ్రీకర్ ప్రసాద్ చేస్తున్నారు.
యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ కలిసి రూ.300కోట్ల భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా దీనిని నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 27వ తేదీన దేవర విడుదల కాబోతోంది.