సరిపోదా శనివారం మేకింగ్ వీడియో చూశారా?

August 04, 2024


img

నాచురల్ స్టార్ నాని, కోలీవుడ్‌ సూపర్ స్టార్ ఎస్‌జె.సూర్య ప్రధాన పాత్రలలో ‘సరిపోదా శనివారం’ సినిమా ఈ నెల 29న విడుదల కాబోతోంది. 

ఈ సందర్భంగా ఈ సినిమాలో సోకులాపురం పేరుతో హైదరాబాద్‌ శివార్లలో నిర్మించిన సెట్స్‌లో చిత్రీకరించిన మేకింగ్ వీడియోని విడుదల చేశారు. సినిమా షూటింగ్‌ కోసం ఓ ఖాళీ ప్రదేశంలో చిన్న బస్తీని ఏవిదంగా నిర్మిస్తారో ఈ మేకింగ్ వీడియోలో చూపారు. అది చూస్తున్నప్పుడు ఓ సినిమా కోసం పడే కష్టం అర్దమవుతుంది. 

వివేక్‌ ఆత్రేయ దదర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రియాంకా అరుల్ మోహన్, సాయి కుమార్‌ ముఖ్యపాత్రలు చేస్తున్నారు. 

ఈ సినిమాకు సంగీతం: జేక్స్ బిజోయ్, కెమెరా: జి.మురళి, ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్, ఆర్ట్: జీఏం శేఖర్, స్టంట్స్‌: రామ్ లక్ష్మణ్‌ చేస్తున్నారు. 

<iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/U01qnMD7D1E?si=FyfPELqpKneOBRDG" title="YouTube video player" frameborder="0" allow="accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture; web-share" referrerpolicy="strict-origin-when-cross-origin" allowfullscreen></iframe>


Related Post

సినిమా స‌మీక్ష