విశ్వంభర యాక్షన్ షురూ

August 04, 2024


img

మెగాస్టార్ చిరంజీవి, త్రిష జంటగా నటిస్తున్న సోషియో ఫ్యాంటసీ సినిమా విశ్వంభర సినిమా అప్‌డేట్‌ వచ్చింది. ప్రముఖ యాక్షన్ డైరెక్టర్‌ అన్లరసు అధ్వర్యంలో ఈ సినిమాలో చిరంజీవి, విలన్‌ గ్యాంగ్ మద్య ఒళ్ళు గగుర్పొడిచే యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించబోతున్నామని యూవీ క్రియెషన్స్ ట్విట్టర్‌ ద్వారా తెలియజేసింది. 

మల్లాది వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, ఇషా చావ్లా, సురభి, ఆషికా రంగనాధ్,కునాల్ కపూర్ ముఖ్య పాత్రలు చేస్తున్నారు.  

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: మల్లాది వశిష్ట, డైలాగ్స్: సాయి మోహన్ బుర్రా,  కెమెరా: మ్యాన్ ఛోటా కె నాయుడు, సంగీతం: ఎంఎం కీరవాణి, ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వర రావు అందిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, విక్రమ్, ప్రమోద్ కలిసి నిర్మిస్తున్న విశ్వంభర 2025, జనవరి 10వ తేదీన సంక్రాంతి పండుగకు ముందు విడుదల కాబోతోంది.


Related Post

సినిమా స‌మీక్ష