కల్కి ఎడి2898 హడావుడి కారణంగా ప్రభాస్‌తో ‘రాజాసాబ్’ చేస్తున్న దర్శకుడు మారుతికి అవసరానికి మించి చాలా సమయమే దక్కింది. అయినా ఆ సినిమా నత్తనడకలు నడుస్తుండటం, కనీసం ఎప్పటికప్పుడు అప్‌డేట్ కూడా ఇవ్వకపోవడం అభిమానులకు చాలా అసహనం కలిగిస్తోంది. వారి ఒత్తిడి కారణంగానే మొన్న ఫాన్ ఇండియా గ్లిమ్స్ విడుదల చేశారు.
ఇంతకాలం ప్రభాస్ డేట్స్ లభించక ఆలస్యమైందని సరిపెట్టుకున్నా సినిమా రిలీజ్ చేయడానికి వచ్చే ఏడాది ఏప్రిల్ 10 వరకు ఎందుకు సమయం తీసుకుంటున్నారో తెలీదు. ఇప్పుడు సినిమా కనీసం రెండు మూడేళ్ళు తీస్తేనే గొప్ప అనే వెర్రి ట్రెండ్ నడుస్తోంది కనుక దర్శకుడు మారుతి కూడా దానిని ఫాలో అవుతున్నారేమో?
ఈ సినిమాకి సంగీతం అందిస్తున్న తమన్ నిన్న సోషల్ మీడియాలో అభిమానులతో చిట్ చాట్ చేసినప్పుడు, రాజాసాబ్ సినిమా అప్‌డేట్ ఇవ్వమని ఓ అభిమాని అడిగితే, వచ్చే ఏడాది జనవరిలో మొదటి పాట రిలీజ్ చేసి ఆ తర్వాత వరుసగా పాటలు రిలీజ్ చేస్తూ సినిమా ప్రమోషన్స్ మొదలుపెడతామని చెప్పారు. అంటే మరో ఆరు నెలల వరకు ‘రాజాసాబ్’ ఎవరికీ కనబడరన్న మాట! ఇదేం అప్‌డేట్ అర్ధం కాదు.