చివరి వారం కలక్షన్స్‌ కోసం కల్కి వల.. బాగానే ఉందే!

August 02, 2024


img

ప్రభాస్‌-నాగ్ అశ్విన్‌ కాంబినేషన్‌లో జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలై సూపర్ హిట్ అయ్యింది. సుమారు రూ.1,100 కోట్లు పైనే కలక్షన్స్‌ రాబట్టింది. సినిమా విడుదలై నెలరోజులు దాటింది గనుక ఇక ఓటీటీ బాట పట్టాల్సిన సమయం దగ్గర పడింది. కనుక ఈ చివరి వారంలో కలక్షన్స్‌ పెంచుకోవడానికి కల్కి ఎడి2898 ఓ ఆఫర్ ప్రకటించింది.

నేటి నుంచి ఆగస్ట్ 9వ తేదీ వరకు దేశవ్యాప్తంగా అన్ని థియేటర్లలో కేవలం రూ.100కే కల్కి ఎడి2898 సినిమా చూడవచ్చని ప్రకటించింది. తమ సినిమాని సూపర్ హిట్ చేసినందుకు కేవలం థాంక్స్ చెపితే సరిపోదని కనుక ఈ చిన్న బహుమతి ఇస్తున్నామని ప్రకటించింది. నేటి  నుంచి వారం రోజులు మాత్రమే ఈ ఆఫర్ ఉంటుందని కల్కి ఎడి2898 టీమ్‌ సోషల్ మీడియాలో తెలిపింది. 

Image


Related Post

సినిమా స‌మీక్ష