హైదరాబాద్‌ మెట్రోలో రవితేజ అనౌన్స్‌మెంట్!

August 02, 2024


img

రవితేజ హీరోగా నటించిన మిస్టర్ బచ్చన్ సినిమా ఈ నెల 15వ తేదీన విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రమోషన్స్ చాలా వెరైటీగా చేస్తున్నారు. ఈరోజు ఉదయం నుంచి హైదరాబాద్‌ మెట్రో రైళ్ళలో రవితేజ గొంతుతో ఓ అనౌన్స్‌మెంట్ వినిపిస్తున్నాయి. 

“మెట్రో ప్రయాణికులకు స్వాగతం సుస్వాగతం. ఏంటి తమ్ముళ్ళూ మెట్రోలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు దొరకలేదా? ఏం పర్లేదు. మీ స్టేషన్ వచ్చే వరకు మీకు మంచి ఎనర్జీనిచ్చేందుకు మిస్టర్ బచ్చన్ నుంచి కొత్త సాంగ్‌ వినిపిస్తాను. హాయిగా వినుకుంటూ వెళ్ళిపోండి. ఆగస్ట్ 15న థియేటర్లకి వచ్చేయండి. అక్కడ మీకు సీ గ్యారెంటీ,” అంటూ రవితేజ చేస్తున్న అనౌన్స్‌మెంట్ విని అందరూ హాయిగా నవ్వుకుంటున్నారు.      

హరీష్ శంకర్‌ దర్శకత్వంలో సిద్దమైన ఈ సినిమాలో బాలీవుడ్‌ నటి భాగ్యశ్రీ బొర్సే హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాకు సంగీతం: మిక్కీ జె.మేయర్, కెమెరా: అయాంక బోస్, ఎడిటింగ్: ఉజ్వల్ కులకర్ణి, ఫైట్స్: రామ్ లక్ష్మణ్‌, పృధ్వీ, స్క్రీన్ ప్లే రైటర్స్: రమేశ్ రెడ్డి, స్టీష్ వెగ్నెశ, ప్రవీణ్ వర్మ, దత్తాత్రేయ, తన్వీ కేసరి, వీఎఫ్ఎక్స్: డెక్కన్ డ్రీమ్స్.      

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, పనోరమ స్టూడియోస్, టీ సిరీస్ స్టూడియోస్ బ్యానర్లపై టిజి విశ్వప్రసాద్, వివేక్‌ అగ్నిహోత్రి కూచిబొట్ల కలిసి ఈ సినిమాని నిర్మించారు. 



Related Post

సినిమా స‌మీక్ష