తిరగబడరా సామి కధ: భార్యభర్తల అనుబంధం!

July 31, 2024


img

రాజ్‌తరుణ్‌-లావణ్యల వివాదం పోలీస్ స్టేషన్, కేసుల వరకు వెళ్ళిన సమయంలో, రాజ్‌తరుణ్‌ నటించిన ‘పురుషోత్తముడు’ సినిమా విడుదలవడం యాదృచ్చికమే కానీ ఇలాంటి సమయంలో అలాంటి టైటిల్‌తో సినిమా రావడం చూసి జనం ముసిముసినవ్వులు నవ్వుకుంటున్నారు. 

రాజ్‌తరుణ్‌-లావణ్యల మద్య చిచ్చు రగిలి ఈ వివాదం పోలీస్ స్టేషన్‌ వరకు వెళ్ళడానికి కారణం అతని హీరోయిన్‌ మాల్వీ మల్హోత్రాతో ప్రేమాయణమే. పురుషోత్తముడు తర్వాత రాజ్‌తరుణ్‌, మాల్వీ మల్హోత్రా జంటగా చేసిన తిరగబడరా సామి ఆగస్ట్ 2న విడుదల కాబోతోంది. 

ఈ సందర్భంగా నేడు హైదరాబాద్‌లో ప్రీ-రిలీజ్ వేడుక నిర్వహించారు. దానిలో రాజ్‌తరుణ్‌ మాట్లాడుతూ, “ ఈ కధ విన్న వెంటనే సినిమా చేస్తానని చెప్పాను. దర్శకుడు ఏఎస్ రవికుమార్ చౌదరి మనసు పెట్టి తీశారు. నిర్మాత మల్కాపురం శివకుమార్ ఖర్చుకి వెనకాడకుండా తీశారు. మాల్వీ మల్హోత్రకి తెలుగులో ఇది మొదటి సినిమాయే అయినప్పటికీ ఆమె చాలా బాగా చేసింది. కనుక అందరూ మా వివాదాలను పక్కన పెట్టి ఈ సినిమా చూసి ఆదరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను,” అన్నారు. 

నిర్మాత శివకుమార్ మాట్లాడుతూ, “ఇది ఓ చక్కటి ఫ్యామిలీ స్టోరీ. భార్యా భర్తల అనుబందం గురించి ఈ సినిమాలో చూపాము. హీరో తన భార్యని కాపాడుకోవడం ఏవిదంగా పోరాడాడు,” అనేది ఈ సినిమా కధాంశం. ఎక్కడ అసభ్యతకి తావు లేకుండా కుటుంబ సమేతంగా చూసే విదంగా సినిమాని తీశాము. అందరూ మా సినిమాని చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాను,” అని అన్నారు. 

రాజ్‌తరుణ్‌ లావణ్యతో 10 ఏళ్ళు సహజీవనం చేసి ఆమెను కాదని ఇప్పుడు తన హీరోయిన్‌ మాల్వీ మల్హోత్రాతో ప్రేమలో పడినందుకే ఈ వివాదం, పోలీస్ కేసు మొదలైంది. ఈ సమయంలో ఓ భర్త తన భార్యని కాపాడుకోవడం ఏవిదంగా పోరాడాడనే అంశంతో ఈ సినిమా విడుదలవుతుండటం చూసి ఎవరికైనా నవ్వు రాకుండా ఉండదు.  


Related Post

సినిమా స‌మీక్ష