హరీష్ శంకర్ దర్శకత్వంలో మాస్ మహారాజ రవితేజ, బాలీవుడ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే జంటగా మిస్టర్ బచ్చన్ సినిమా ఆగస్ట్ 15న విడుదల కాబోతోంది. కనుక సినిమా ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. ఇప్పటికే రెండు పాటలు, టీజర్‌తో సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి. ఇప్పుడు ఆగస్ట్ 2న జీక్కీ అంటూ సాగే మూడో పాటని విడుదల చేస్తున్నట్లు ప్రకటిస్తూ, రవితేజ, భాగ్యశ్రీ బొర్సేల పోస్టర్ ఒకటి విడుదల చేసింది.
ఈ సినిమాలో జగపతిబాబు ఓ కీలకపాత్ర చేస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం: మిక్కీ జె.మేయర్, కెమెరా: అయాంక బోస్, ఎడిటింగ్: ఉజ్వల్ కులకర్ణి, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, పృధ్వీ, స్క్రీన్ ప్లే రైటర్స్: రమేశ్ రెడ్డి, స్టీష్ వెజ్ఞెశ, ప్రవీణ్ వర్మ, దత్తాత్రేయ, తన్వీ కేసరి, వీఎఫ్ఎక్స్: డెక్కన్ డ్రీమ్స్.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, పనోరమ స్టూడియోస్, టీ సిరీస్ స్టూడియోస్ బ్యానర్లపై టిజి విశ్వప్రసాద్, వివేక్ అగ్నిహోత్రి కూచిబొట్ల కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.