గోపీ చంద్ విశ్వం మేకింగ్ వీడియో

July 31, 2024


img

గోపీచంద్, శ్రీను వైట్ల కాంబినేషన్‌లో విశ్వం అనే యాక్షన్ మూవీ సిద్దం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో గోపీచంద్‌కు జోడీగా కావ్య థాపర్ నటిస్తోంది. గత ఏడాది సెప్టెంబర్‌లో ఈ సినిమా పూజా కార్యక్రమం చేసి షూటింగ్‌ ప్రారంభించారు. 

ఇటలీలోని మిలాన్ నగరంలో హీరో హీరోయిన్లపై సాంగ్, కొన్ని యాక్షన్ సీన్స్ షూట్ చేశారు. ఆ మేకింగ్ వీడియోని గోపీచంద్ యూట్యూబ్‌లో విడుదల చేశారు. అది చూస్తే ఈ సినిమా హాలీవుడ్ యాక్షన్ మూవీలా అనిపిస్తుంది. ఇక రనింగ్ ట్రైన్‌లో వెన్నెల కిషోర్, అజయ్ ఘోష్, సీనియర్ నరేశ్ తదితరులతో చేసిన కామెడీ సీన్ చూస్తే ఓ కమర్షియల్ సినిమాకి కావాల్సినవన్నీ విశ్వంలో ఉన్నాయని స్పష్టం అవుతుంది.     

ఈ సినిమాకి స్క్రీన్ ప్లే: గోపీ మోహన్, సంగీతం: చైతన్ భరద్వాజ్, కెమెరా: కేవీ గుహన్, ఫైట్స్: రాష్ట్రవ్యాప్తంగా వర్మ, దినేష్ సుబ్బరాయన్, కొరియోగ్రఫీ: శేఖర్ మాష్టర్, ఆర్ట్: కిరణ్ కుమార్‌ మన్నే, ఎడిటింగ్: అమర్ రెడ్డి కుడుముల చేస్తున్నారు. త్వరలో ఈ సినిమా విడుదల చేయబోతున్నట్లు మేకింగ్ వీడియోలో చెప్పారు కానీ ఎప్పుడు అనేది చెప్పలేదు.



Related Post

సినిమా స‌మీక్ష