ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పడుకొనే తదితరులు నటించిన సూపర్ హిట్ మూవీ కల్కి ఎడి2898 థియేటర్లలో విడుదలైన రోజు నుంచే ప్రభంజనం సృష్టించింది. ఆ సినిమా కోసం ఓటీటీ ప్రేక్షకులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. వారందరి నిరీక్షణ త్వరలో ముగియబోతోంది. కల్కి ఎడి2898 డిజిటల్ స్త్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. కనుక అగ్రిమెంట్ ప్రకారం సినిమా థియేటర్లలో రిలీజ్ అయిన 8 వారాల తర్వాత అంటే ఆగస్ట్ 23వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఒకవేళ నిర్మాత అశ్వినీ దత్ అంగీకరిస్తే ఆగస్ట్ 15వ తేదీ నుంచే అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం అయినా ఆశ్చర్యం లేదు.
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై సుమారు రూ.600 కోట్లతో తీసిన ఈ సినిమా బారీ అంచనాల నడుమ విడుదలైంది. కానీ ప్రేక్షకుల అంచనాలకు మించి సినిమా ఉండటంతో థియేటర్లలోనే రూ.1,200 కోట్లకు పైగా కలక్షన్స్ రాబట్టి ఇంకా దూసుకుపోతూనే ఉంది. అదికాక డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం అమెజాన్ ప్రైమ్ కూడా భారీగానే చెల్లించింది.
కల్కి ఎడి2898 షూటింగ్ మొదలుపెట్టక మునుపే దానికి సీక్వెల్ తీయాలని దర్శకుడు నాగ్ అశ్విన్ ప్లాన్ చేసుకున్నారని, రెండో భాగంలో తన పాత్ర నిడివి ఎక్కువ ఉంటుందని కమల్ హాసన్ చెప్పారు. కల్కి ఎడి2898 సూపర్ హిట్ అవడంతో దాని సీక్వెల్ పనులు ప్రారంభించడానికి గ్రీన్ సిగ్నల్ వచ్చేసిన్నట్లే.