రాజాసాబ్ ఫస్ట్ గ్లిమ్స్‌... అదుర్స్

July 30, 2024


img

కల్కి ఎడి2898 ఒకే ఒక్క సినిమాతో ప్రభాస్‌ రాధేశ్యామ్, ఆదిపురుష్ రెండు ఫ్లాపులను మరపించారు. దాని తర్వాత చేస్తున్న ‘ది రాజాసాబ్’ సినిమాతో మళ్ళీ మిర్చీ నాటి డార్లింగ్ ప్రభాస్‌ని చూపబోతున్నాడు దర్శకుడు     మారుతి. రాజాసాబ్ ఫస్ట్-లుక్ పోస్టర్‌, తాజాగా విడుదలైన ఫస్ట్ గ్లిమ్స్‌ రెండూ కూడా అదే సూచిస్తున్నాయి. 

ఫస్ట్ గ్లిమ్స్‌లో ప్రభాస్‌ డైలాగ్స్ ఏమీ చెప్పలేదు కానీ బైక్‌పై నుంచి స్టయిల్‌గా దిగి బొకే పట్టుకొని ఓసారి బైక్‌ అద్దంలో చూసుకుంటూ, ‘ఎంత స్వీట్‌గా ఉన్నావు డార్లింగ్’ అన్నట్లు తనకు తానే పూలతో దిష్టి తీసుకోవడం చూస్తే అభిమానులు ఖుష్ అవకుండా ఉండలేరు. 

ఇది మారుతీ జోనర్ హర్రర్, రొమాంటిక్, కామెడీ మిక్స్ సినిమా అని ఫస్ట్ గ్లిమ్స్‌లో మరోసారి స్పష్టం చేశారు. ఈ సినిమా 2025 సంక్రాంతి వస్తుందని అభిమానులు ఎదురుచూస్తుంటే దర్శకుడు మారుతి వారందరికీ షాక్ ఇస్తూ వచ్చే ఏడాది ఏప్రిల్‌ 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోందని ఫస్ట్ గ్లిమ్స్‌లో ప్రకటించేరు. 

ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఓ ముఖ్య పాత్ర చేస్తున్నారు. 

రాజాసాబ్ సినిమాకు సంగీతం: ఎస్ఎస్ తమన్, కెమెరా: కార్తీక్ పళని, ఆర్ట్ డైరెక్టర్: రాజీవన్, ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వర రావు చేస్తున్నారు. 

 పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు.


Related Post

సినిమా స‌మీక్ష