దుల్కర్ సల్మాన్ కొత్త సినిమా: ఆకాశంలో ఒక తార

July 28, 2024


img

ప్రముఖ మళయాళీ నటుడు దుల్కర్ సల్మాన్‌ మహానటి, సీతారామం సినిమాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాలలో చోటు సంపాదించుకున్నారు. వాటి తర్వాత కల్కి ఎడి2898లో అతిధి పాత్రలో మెరిశాడు. తాజాగా లక్కీ భాస్కర్ అనే మరో సినిమా చేస్తున్నాడు. 

ఇప్పుడు పవన్ సాధినేని దర్శకత్వంలో మరో కొత్త సినిమా మొదలుపెట్టాడు. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్, స్వప్నా సినిమా, లైట్ మీడియా బాక్స్ బ్యానర్లపై సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం కలిసి నిర్మిస్తున్నారు. ఇవాళ్ళ దుల్కర్ సల్మాన్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా పేరు, ఫస్ట్-లుక్ పోస్టర్‌ విడుదల చేశారు. దానిలో భుజం మీద తువ్వాలుతో దుల్కర్ సల్మాన్‌, స్కూలు బ్యాగు తగిలించుకున్న ఓ పాపని చూపారు. 

దుల్కర్ సల్మాన్‌ వరుసగా హిట్లు కొడుతున్నప్పటికీ ఇమేజ్‌ చట్రంలో చిక్కుకోకుండా విభిన్నమైన కధాంశాలతో సినిమాలు చేసే మళయాళీ హీరోల పద్దతిలోనే ముందుకు సాగుతున్నట్లు స్పష్టమవుతోంది.


Related Post

సినిమా స‌మీక్ష