మాస్ మహరాజ్ రవితేజ హీరోగా ఆర్‌టి75 వర్కింగ్ టైటిల్‌తో మొదలవబోతున్న కొత్త సినిమాకు భోగవరపు భాను దర్శకుడు. బాబీ కొల్లి దర్శకత్వంలో బాలకృష్ణ చేస్తున్న సినిమాకు భాను డైలాగ్స్ వ్రాస్తున్నారు. అంతకు ముందు మెగాస్టార్ చిరంజీవి సినిమా వాల్తేర్ వీరయ్యకు భాను డైలాగ్స్ వ్రాశారు. ఇప్పుడు ఈ యువ రచయిత రవితేజ సినిమాతో దర్శకుడుగా పరిచయం కాబోతున్నారు.
ఇక నవీన్ చంద్రకు విలన్‌గా నటించడం ఇది తొలిసారి కాదు. అరవింద సమేత రాఘవలో నెగెటివ్ రోల్ చేశారు. తాజాగా రామ్ చరణ్-శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న గేమ్ చేంజర్‌లో కూడా అటువంటి పాత్రే చేస్తున్నట్లు సమాచారం. ఇప్పుడు మాస్ హీరో రవితేజ సినిమాలో విలన్‌గా నటించే అవకాశం లభించింది. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది.
ఈ సినిమాకు సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: కార్తీక్ ఘట్టమనేని, ఎడిటింగ్: నవీన్ నూలి చేయబోతున్నారు.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ సినిమాస్ బ్యానర్లపై నాగ వంశీ, సాయి సౌజన్య కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాను శ్రీకార స్టూడియోస్ సమర్పిస్తుంది. వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు ఈ సినిమా విడుదల చేయబోతున్నట్లు ముందే చెప్పేశారు.