మాస్ మహారాజ రవితేజ, క్యాడ్‌బరీ బేబీ భాగ్యశ్రీ బొర్సే జంటగా నటిస్తున్న మిస్టర్ బచ్చన్ ఆగస్ట్ 15వ తేదీన విడుదల కాబోతోంది. ఒకరోజు ముందుగా ఆగస్ట్ 14న ఈ సినిమా ప్రీమియర్ విడుదల చేస్తామని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ట్విట్టర్‌లో వెల్లడించింది. ఈ సందర్భంగా ఈ సినిమాలోని రవితేజ కొత్త పోస్టర్ విడుదల చేశారు.
ఆగస్ట్ 15వ తేదీన రిలీజ్ కావలసిన పుష్ప-2 సినిమా డిసెంబర్‌కు వెళ్ళిపోవడంతో ఆగస్ట్ 15 స్లాట్ ఖాళీ అయ్యింది. దానిని మిస్టర్ బచ్చన్ సద్వినియోగం చేసుకొని వచ్చేస్తున్నాడు.
పనోరమ స్టూడియోస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లపై టిజి విశ్వప్రసాద్, వివేక్ అగ్నిహోత్రి కూచిబొట్ల కలిసి ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమాకు సంగీతం మిక్కీ జె. మేయర్ చేశారు.
ఈ సినిమాలో రవితేజ ఇన్‌కమ్ టాక్స్ ఆఫీసరుగా, బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ వీరాభిమానిగా నటిస్తున్నారు.
ఈ సినిమాకి బయ్యర్లు పోటీ పడుతున్నప్పటికీ ఎక్కువ ఆఫర్ చేయడం లేదు. ఆంధ్రాకి రూ.18 కోట్లు, నైజాంకి రూ.15 కోట్లు, సీడెడ్‌కి రూ.15 కోట్లు ఆఫర్ చేస్తున్నారు. ఆశియన్ సురేశ్ సంస్థ, దిల్‌రాజు మిస్టర్ బచ్చన్ నైజాం డిస్ట్రిబ్యూషన్ హక్కుల కోసం ప్రయత్నిస్తున్నారు. కానీ బయ్యర్ల ఆఫర్లు తక్కువగా ఉండటంతో ఈ సినిమా ఎవరికి ఇవ్వాలో నిర్మాతలు ఇంకా నిర్ణయించుకోలేదు. కానీ ఈ సినిమా డిజిటల్ రైట్స్ ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకోగలిగింది.