అల్లు అర్జున్‌ తర్వాత సినిమా గురూజీతోనే పక్కా!

July 21, 2024


img

దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ తన సూపర్ హిట్ సినిమా ‘అల వైకుంఠపురంలో’ సినిమాలో అల్లు అర్జున్‌ని ఎంతో స్టైయిలిష్‌గా చూపారు. కానీ పుష్ప-1,2 కోసం అల్లు అర్జున్‌ చాలా మొరటుగా మారిపోక తప్పలేదు. అయినప్పటికీ యావత్ దేశంలోనే కాక విదేశీ ప్రేక్షకులను సైతం అలరించారు.

పుష్ప-2 సినిమా దాదాపు కొలిక్కి వచ్చేసింది. కనుక దాని తర్వాత  మళ్ళీ గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమా చేయబోతున్నారని నిర్మాత బన్నీ వాసు చెప్పారు. అయితే ఈ సినిమా షూటింగ్‌ మొదలుపెట్టేందుకు మరో 3-4 నెలల సమయం పట్టే అవకాశం ఉందని చెప్పారు. 

అల్లు అర్జున్‌-త్రివిక్రమ్ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో తీసిన జులాయి(2012), సన్ ఆఫ్ సత్యమూర్తి(2015), అల వైకుంఠపురంలో (2020) మూడూ సూపర్ హిట్స్. కనుక ఇన్నేళ్ళ తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరి కాంబినేషన్‌లో సినిమా అంటే భారీ అంచనాలే ఉంటాయి.

పైగా అల్లు అర్జున్‌ ఇప్పుడు పాన్ ఇండియా హీరో స్థాయికి ఎదిగిపోయారు కనుక ఈ సినిమాను ఆ స్థాయిలోనే నిర్మించడానికి గీతా ఆర్ట్స్ బడ్జెట్‌ సిద్దం చేసుకుంటోంది. కనుక త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు ఇదే తొలి పాన్ ఇండియా మూవీ కాబోతోంది. 

త్రివిక్రమ్ శ్రీనివాస్‌ దర్శకత్వంలో మహేష్‌ బాబు హీరోగా తీసిన ‘గుంటూరు కారం’ సినిమా ఫ్లాప్ అవడంతో ఆయనపై ఆ ఒత్తిడి కూడా ఉంటుంది. అయితే అల్లు అర్జున్‌తో త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు దోస్తీ, మంచి ట్రాక్ రికార్డ్ ఉన్నందున ఈ సినిమా కూడా తప్పకుండా సూపర్ హిట్ అయ్యే అవకాశం ఉంది. 


Related Post

సినిమా స‌మీక్ష