ఆగస్ట్ నుంచి రామ్ చరణ్- బుచ్చిబాబు సినిమా?

July 21, 2024


img

రామ్ చరణ్‌-శంకర్ సినిమా గేమ్ చేంజర్‌ షూటింగ్‌ ఇంకా ఎప్పుడు పూర్తవుతుందో తెలీదు. కానీ రెండేళ్ళు సాగదీసాక చివరికి అది కూడా భారతీయుడు-2లా బోర్లాపడకుండా తీస్తే చాలని అభిమానులు కోరుకుంటున్నారు. 

ఇంతకాలం ఈ సినిమాతో బిజీగా ఉండటం వలన ఉప్పెన బుచ్చిబాబుతో రామ్ చరణ్‌ సినిమా మొదలుపెట్టలేకపోయారు. కానీ ఇప్పుడు గేమ్ చేంజర్‌లో రామ్ చరణ్‌ చేయాల్సిన సన్నివేశాలన్నీ పూర్తి చేసేసినందున, బుచ్చిబాబుతో సినిమా మొదలుపెట్టేయవచ్చు. అయితే అది మొదలుపెట్టే ముందు ఫ్యామిలీతో కలిసి ఓ ఫారిన్ టూర్ వెళ్ళిరావాలని రామ్ చరణ్‌ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. 

ఇక దర్శకుడు బుచ్చిబాబు కూడా రెండేళ్ళుగా ఈ సినిమా పని మీదే ఉన్నారు. ఈ సినిమాకి సంగీతం అందిస్తున్న సంగీత దర్శకుడు ఏఆర్ రహమాన్‌తో కలిసి మూడు పాటలు రెడీ చేసి పెట్టారు. రామ్ చరణ్‌ వచ్చేలోగా మిగిలిన రెండు పాటలు, పూర్తి చేసి ఆగస్ట్ నుంచి రెగ్యులర్ షూటింగ్‌ ప్రారంభించడానికి ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. 

ఈ సినిమాలో రామ్ చరణ్‌కు జోడీగా బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటించబోతోంది. రిడ్డి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్లపై కిలారు సతీష్ నిర్మించబోతున్న ఈ సినిమాకి వర్కింగ్ టైటిల్‌గా ‘పెద్ది’ అని అనుకుంటున్నారు. 


Related Post

సినిమా స‌మీక్ష