నాచురల్ స్టార్ నాని, కోలీవుడ్ స్టార్ ఎస్‌జె.సూర్య ప్రధాన పాత్రలలో ‘సరిపోదా శనివారం’ సినిమా టీజర్ నేడు (శనివారం) విడుదలైంది. ఈ సినిమాలో ఎస్.జె.సూర్య విలన్‌గా నటిస్తున్నారు. ఇవాళ్ళ ఆయన పుట్టినరోజు సందర్భంగా ‘నాట్ టీజర్’ (టీజర్ కాదు) అంటూ టీజర్ విడుదల చేశారు.
టీజర్‌లో నాని వాయిస్ ఓవర్‌తో శ్రీకృష్ణుడు-సత్యభామ నరకాసురుడిని వాదించడం గురించి చెపుతూ ఈ సినిమా కధని క్లుప్తంగా చెప్పేశారు.
వివేక్ ఆత్రేయ దదర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో ప్రియాంకా అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. వారిరువురూ కలిసి విలన్‌ని ఏవిదంగా ఎదుర్కున్నారనేది ఈ సినిమా కధ. టీజర్ ముగింపులో ‘వెల్ కమ్ సార్. హ్యాపీ బర్త్ డే” అని చెప్పడం, ఇన్‌స్పెక్టర్ డ్రెస్‌లో ఎస్‌జె.సూర్యని చూపించడం చాలా బాగుంది. ఈ సినిమాలో సాయి కుమార్ ఓ ముఖ్యపాత్ర చేస్తున్నారు.
డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు సంగీతం: జేక్స్ బిజోయ్, కెమెరా: జి.మురళి, ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్ చేస్తున్నారు.