సినిమాల నుంచి రాజకీయాలలోకి వచ్చి ఏపీ ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ మొదట ప్రభుత్వ బాధ్యతలు తర్వాతే సినిమాలు అన్నట్లు పనిచేసుకుపోతున్నారు. మళ్ళీ హిందూపురం ఎమ్మెల్యేగా ఎన్నికైన నందమూరి బాలకృష్ణ మాత్రం మొదట సినిమాలు ఆ తర్వాతే ఎమ్మెల్యే బాధ్యతలు అన్నట్లు వ్యవహరిస్తుండటం విశేషం.
పవన్ కళ్యాణ్ మొదలుపెట్టిన హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీలు పక్కన పెట్టేసి ఉప ముఖ్యమంత్రిగా మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కానీ నందమూరి బాలకృష్ణ బాబీతో మొదలుపెట్టిన తన 109వ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉంటున్నారు. ఇప్పటికే 50% పైగా పూర్తి చేశారు. తర్వాత షెడ్యూల్ రాజస్థాన్‌లో ప్లాన్ చేయడంతో అక్కడికి బయలుదేరి వెళుతున్నారు. రాజస్థాన్‌లో కొన్ని ముఖ్యమైన యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించబోతున్నట్లు సమాచారం.
ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, ఊర్వశీ రౌతేలా తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ఇంకా పేరు ఖరారు చేయని ఈ సినిమాకు స్క్రీన్ ప్లే: కె. చక్రవర్తి రెడ్డి, డైలాగ్స్: భాను, నందు, సంగీతం: తమన్, కెమెరా: విజయ్ కార్తీక్ కణ్ణన్, ఎడిటింగ్: నిరంజన్ దేవరమనే చేస్తున్నారు.
ను సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకార స్టూడియోస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య కలిసి నిర్మిస్తున్నారు.