సర్దార్-2 షూటింగ్‌లో స్టంట్ మ్యాన్ మృతి

July 17, 2024


img

కోలీవుడ్‌లో విషాద ఘటన జరిగింది. కార్తీ హీరోగా సర్దార్-2 సినిమా చెన్నైలో షూటింగ్‌ జరుగుతుండగా, స్టంట్ మ్యాన్ ఏళుమలై ప్రమాదవశాత్తూ 20 అడుగుల ఎత్తు నుంచి క్రిందపడి చనిపోయాడు.

యూనిట్ సభ్యులు హుటాహుటిన సమీపంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు తీసుకువెళ్ళారు. వైద్యులు ఆయన ప్రాణాలు కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు. కానీ మంగళవారం రాత్రి 11.30 గంటలకు మృతి చెందిన్నట్లు వైద్యులు తెలిపారు.

ఈ ఘటనపై హీరో కార్తీ, సినీ నిర్మాణ సంస్థ ప్రిన్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంతాపం వ్యక్తం చేశారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ స్టంట్ మ్యాన్ ఏళుమలై చనిపోవడం చాలా బాధ కలిగించిందని, ఆయన కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు.

కార్తి హీరోగా వచ్చిన సూపర్ హిట్ సర్దార్‌ సినిమాకు సీక్వెల్‌గా ఈ సినిమాని జూన్ 2వ వారంలో పూజ కార్యక్రమాలు చేసి మొన్న సోమవారం నుంచే చెన్నైలో భారీ సెట్ వేసి రెగ్యులర్ షూటింగ్‌ ప్రారంభించారు.

షూటింగ్‌ ప్రారంభించిన రెండో రోజే ఈ విషాద ఘటన జరగడంతో యూనిట్ సభ్యులు అందరూ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. చెన్నై, విరుగంబాకం పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు.


Related Post

సినిమా స‌మీక్ష