ఇది నాకు చాలా కష్ట సమయం: నవీన్ పోలిశెట్టి ట్వీట్‌

July 17, 2024


img

 మన మూడు జాతి రత్నాలలో ఒకడైన నవీన్ పోలిశెట్టి ఎట్టకేలకు సోషల్ మీడియాలో తనకు అమెరికాలో జరిగిన ప్రమాదం గురించి అభిమానులతో పంచుకున్నారు. అమెరికాలో షూటింగ్‌లో పాల్గొన్నప్పుడు ప్రమాదం జరిగిందని దానిలో కాలు, చేతికి పెద్ద ఫ్రాక్చర్స్ అయ్యాయని, అది తనకు చాలా కష్టకాలమని చెప్పారు.

అందువల్లే ఈ మద్య తాను సినిమాలు చేయలేకపోయానన్నారు. కానీ పూర్తిగా కోలుకోవడానికి మరికొన్ని నెలలు పడుతుందని, కోలుకున్నాక మళ్ళీ చక్కటి సినిమాలతో మీ అందరినీ అలరిస్తానని ట్వీట్‌ చేశారు.

ఆలోగా ఓ అద్భుతమైన స్క్రిప్ట్ రెడీ అవుతోందని, కోలుకోగానే ఆ సినిమా షూటింగ్‌లో పాల్గొంటానని ట్వీట్‌ చేశారు. నాపై ఇంత అభిమానం చూపుతున్న మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అంటూ నవీన్ పోలిశెట్టి ట్వీట్‌ చేశారు. దానితో పాటు చేతికి కట్టుతో ఉన్న ఓ తాజా ఫోటో కూడా అభిమానులతో షేర్ చేశారు.  

నవీన్ పోలిశెట్టికి ఈ ప్రమాదం జరిగి ఇప్పటికే 5 నెలలు కాగా మరికొన్ని నెలలు విశ్రాంతి, ఫిజియో థెరపీ చికిత్స అవసరం అని చెప్పడం చూస్తే చాలా తీవ్రంగా గాయపడిన్నట్లు అర్దమవుతోంది. 

నవీన్ పోలిశెట్టి చేసిన చివరి సినిమా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి 2023లో విడుదలైంది. అనుష్క హీరోయిన్‌గా చేసిన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. దాని తర్వాత కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో అనగనగా ఒకరాజు సినిమా మొదలుపెట్టినప్పుడు ఈ ప్రమాదం జరిగింది. 


Related Post

సినిమా స‌మీక్ష