అశ్విన్ బాబు, సూర్యవంశీ, అర్బాజ్ ఖాన్ ప్రధాన పాత్రలలో అఫ్సర్ దర్శకత్వంలో ‘శివం భజే’ సినిమా ఆగస్ట్ 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఈ సినిమాలోని ‘రామరామేశ్వరం’ అంటూ సాగే మొదటి పాటని గురువారం ఉదయం 11.36 గంటలకు విడుదల చేయబోతున్నట్లు నిర్మాణ సంస్థ గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ సోషల్ మీడియాలో ప్రకటించింది.
ప్రస్తుతం పీరియాడికల్ సినిమాలు, దెయ్యాలు భూతాలు, తాంత్రిక విద్యల ట్రెండ్ నడుస్తోంది కనుక ఈ సినిమా కూడా ఆ జోనర్‌లోనే వస్తోందని టీజర్ చూస్తే అర్దమవుతుంది.
ఈ సినిమాకు సంగీతం: బి వికాస్, కెమెరా: దాశరధి శివేంద్ర, ఆర్ట్: సాహి సురేశ్, ఎడిటింగ్: ఛోటా కె ప్రసాద్ చేస్తున్నారు.
ఈ సినిమాని గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మించారు.