పేకమేడలు సినిమా కొత్త ప్రయోగం బానే ఉందే!

July 17, 2024


img

వినోద్ కృష్ణ, అనూష కృష్ణ జంటగా నటించిన పేకమేడలు సినిమా ఈ నెల 19న విడుదల కాబోతోంది. ఈ సినిమా నిర్మాత రాకేశ్ వర్రే ఓ సరికొత్త ప్రయోగం చేశారు. సాధారణంగా బారీ బడ్జెట్‌తో తీసిన పెద్ద హీరోల సినిమాలు విడుదలైనప్పుడు మొదటి వారం పది రోజులు టికెట్‌ ఛార్జీలు భారీగా పెంచి అదనపు షోలు వేసుకుంటారు.

కానీ రాకేశ్ వర్రే తన పేకమేడలు సినిమాని రెండు రోజుల ముందుగా హైదరాబాద్‌, విజయవాడ, విశాఖ నగరాలలో ప్రీమియర్ షోలు వేయించి కేవలం రూ.50లకే సినిమా చూసే అవకాశం కల్పించారు. ఈ ప్రయోగం విజయవంతం అవడంతో రెండు తెలుగు రాష్ట్రాలలో డిస్ట్రిబ్యూటర్లు పేకమేడలు సినిమా హక్కులు తీసుకునేందుకు క్యూ కట్టారు. 

ఈ సినిమాలో రీతిక శ్రీనివాస్, జగన్‌ యోగి రాజ్, అనూష నూతల, గణేశ్ తిప్పరాజు, నరేన్ యాదవ్‌ ముఖ్యపాత్రలు చేశారు. 

పేకమేడలు దర్శకుడు నీలగిరి మామిళ్ళ మీడియాతో మాట్లాడుతూ, ఇటీవల విడుదలైన మా సినిమా ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు ఈ ప్రయోగం కూడా విజయవంతం అవడం చాలా సంతోషంగా ఉంది. మా పేకమేడలు సినిమాలో చక్కటి సందేశంతో పాటు ప్రేక్షకులను రంజింపజేసేవిదంగా మంచి కామెడీ, ఫ్యామిలీ డ్రామా కూడా ఉన్నాయి. మా సినిమాని ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని భావిస్తున్నాను,” అని అన్నారు. 

క్రేజీ యాంట్స్ బ్యానర్‌పై రాకేశ్ వర్రే నిర్మించిన ఈ సినిమాకు వరుణ్ బోర సహ నిర్మాత. డైలాగ్స్, లిరిక్స్: భార్గవ కార్తీక్, సంగీతం: స్మరణ్ సాయి, కెమెరా: హరిచరణ్, ఎడిటింగ్: సృజన అడుసుమిల్లి, హంజ్రా అలీ చేశారు.       



Related Post

సినిమా స‌మీక్ష