ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న కృతిశెట్టి ఆ తర్వాత బంగార్రాజు, శ్యామ్ సింగరాయ్ సినిమాలు చేసింది. ఆ సినిమాలలో ఆమె నటనకు మంచి పేరే వచ్చింది కానీ రెండు సినిమాలు పెద్దగా ఆడకపోవడంతో ఆమె ఇండస్ట్రీలో వెనకబ్డిపోయింది. ఆ తర్వాత శర్వాతో చేసిన ‘మనమే’ సినిమా పెద్దగా ఆడకపోవడంతో ఆమె పని అయిపోయిందనే గుసగుసలు వినిపించాయి.
కానీ ఆమెకు మరో గొప్ప అవకాశం వచ్చింది. ఈసారి ప్రముఖ దర్శకుడు సెల్వరాజ్ దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా చేయబోతున్న సినిమాలో హీరోయిన్‌గా కృతిశెట్టికి అవకాశం లభించింది. దుల్కర్ సల్మాన్ పాన్ ఇండియా హీరో. సెల్వరాజ్ కధ విషయంలో ఎంత శ్రద్ద చూపుతారో, హీరోయిన్ పాత్రకు అంతే ప్రాధాన్యం ఇచ్చి తీర్చిదిద్దుతారు. కనుక కృతి శెట్టికి ఈ సినిమాలో ఛాన్స్ దొరకడం అదృష్టమే. ఒకవేళ ఈ సినిమా హిట్ అయితే కృతిశెట్టికి మళ్ళీ సినిమాలతో బిజీ అయిపోవచ్చు.
దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ‘లక్కీ భాస్కర్’ సినిమా త్వరలో విడుదల కాబోతోంది. దాని తర్వాత కృతిశెట్టితో ఈ సినిమా మొదలుపెడతాడు. ప్రముఖ నటుడు రానా ఈ సినిమాని నిర్మించబోతున్నారు.