రజినీకాంత్ 171వ సినిమా కూలీ షురూ

July 06, 2024


img

జైలర్ సినిమాతో మరో హిట్ కొట్టిన కోలీవుడ్‌ సూపర్ స్టార్ రజినీకాంత్ ఇప్పుడు ‘కూలీ’ పేరుతో తన171వ సినిమా ప్రారంభించారు. ప్రముఖ కోలీవుడ్‌ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతుండగా, రూ.230 కోట్ల భారీ బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ దీనిని 5 భాషల్లో నిర్మించబోతున్నారు.

ఈ సినిమా టైటిల్‌ గ్లింప్స్, రజినీకాంత్ టెస్ట్-లుక్ పోస్టర్‌ అందరినీ ఆకట్టుకుంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్‌ మొదలుపెడతామని, అప్పుడు మరో అద్భుతమైన పోస్టర్ విడుదల చేస్తామని దర్శకుడు లోకేశ్ కనగరాజ్ తెలియజేశారు. 

ఈ సినిమాలో శ్రుతీహాసన్, సత్యరాజ్, రెబ్బా మోనికా జాన్ ముఖ్య పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాకు కధ: లోకేశ్ కనగరాజ్, డైలాగ్స్: చంద్ర అంబజగన్, సంగీతం: అనిరుధ్ రవిచంద్రన్, కెమెరా: గిరీష్ గోవర్ధన్, ఎడిటింగ్: ఫీలోమిన్ రాజ్ చేస్తున్నారు.  

బంగారం స్మగ్లింగ్ కధాంశంగా ఈ సినిమాని నిర్మిస్తున్నట్లు టైటిల్‌ గ్లిమ్స్‌లోనే చెప్పేశారు. ఈ సినిమాలో రజినీకాంత్ కాస్త ‘గ్రే షేడ్’ ఉన్న పాత్ర చేయబోతున్నట్లు తెలుస్తోంది. 

 


Related Post

సినిమా స‌మీక్ష