ఈరోజు కళ్యాణ్ రామ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా అతను చేయబోయే రెండు సినిమాలకు సంబందించి అప్డేట్ అభిమానులతో పంచుకున్నారు. ఎన్‌కెఆర్ 21 వర్కింగ్ టైటిల్‌తో చేస్తున్న సినిమాకు ప్రదీప్ చిలుకూరి దర్శకుడుగా, అనిల్ పాదూరి దర్శకత్వంలో బింబిసారకు సీక్వెల్‌గా చేస్తున్న ఎన్‌కెఆర్ 22 వర్కింగ్ టైటిల్‌తో మరో సినిమా చేయబోతున్నాడు.
ఎన్‌కెఆర్ 21 సినిమాలో కళ్యాణ్ రామ్‌కు జోడీగా బాలీవుడ్ నటి సయీ మంజ్రేకర్ నటించబోతోంది. ఈ సినిమాలో విజయశాంతి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటించబోతున్నారు. కొన్ని రోజుల క్రితమే ఆమె ఫస్ట్-లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు. శ్రీకాంత్, సోహెల్ ఖాన్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకి స్క్రీన్ ప్లే: విస్సా శ్రీకాంత్, సంగీతం: అజనీష్ లోక్‌నాథ్, కెమెరా: రామ్ ప్రసాద్, ఎడిటింగ్: తమ్మిరాజు చేస్తున్నారు.
ఈ సినిమాను ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక్ క్రియెషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బులుసు కలిసి నిర్మిస్తున్నారు.
బింబిసారకు సీక్వెల్‌గా చేస్తున్న ఎన్‌కెఆర్ 22 సినిమాలో యుద్ధభూమిలో ఏనుగులతో కాన్సెప్ట్ పోస్టర్ నేడు విడుదల చేశారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై కొసరాజు హరికృష్ణ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.