శేఖర్ కమ్ముల కోలీవుడ్ నటుడు ధనుష్ హీరోగా చేస్తున్న కుబేర సినిమాలో రష్మిక మందన కూడా ఓ ముఖ్య పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆమెను పరిచయం చేస్తూ ఈరోజు ఫస్ట్-లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఓ సూట్ కేసు పట్టుకొని అడవిలో నడుస్తున్నట్లు దానిలో చూపారు. అది చూసినప్పుడు ఆమె అడవిలో ఎందుకు ఉంది? అడవిలో సూట్ కేసు దేనికి? ఆ సూట్ కేసులో ఏముంది? అనే సందేహాలు కలుగక మానవు.
సమాజంలో డబ్బు... దాని ప్రభావం ఆధారంగా శేఖర్ కమ్ముల ఈ కుబేరా కధ అల్లుకున్నట్లు అర్దమవుతోంది. ఈ సినిమాలో ధనుష్, నాగార్జున, రష్మిక మందన, జిమ్ సరబ్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాకి కధ: శేఖర్ కమ్ముల, చైతన్య పింగళి, దర్శకత్వం: శేఖర్ కమ్ముల, సంగీతం: దేవి శ్రీప్రసాద్, కెమెరా: నికేత్ బొమ్మి చేస్తున్నారు.
శ్రీ వేంకటేశ్వర సినిమాస్, ఎల్ఎల్పి అమిగోస్ క్రియెషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై సునీల్ నారంగ్, పుస్కుర్ రాంమోహన్ రావు కలిసి ఈ సినిమాని 5 భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు.