కల్కి ఎడి2898 సీక్వెల్‌: నాగ్ అశ్విన్‌ ఏం చెప్పరంటే...

July 05, 2024


img

ప్రభాస్‌ హీరోగా నాగ్ అశ్విన్‌ దర్శకత్వంలో జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన కల్కి ఎడి2898 సూపర్ హిట్ అయ్యింది. ఈ 9 రోజులలోనే రూ.700 కోట్లకు పైగా కలక్షన్స్‌ సాధించి, త్వరలో రూ.1,000 కోట్లు రికార్డ్ సాధించబోతోంది. 

ఈ సందర్భంగా దర్శకుడు నాగ్ అశ్విన్‌ మీడియాతో మాట్లాడుతూ, “కల్కి ఎడి2898 సూపర్ హిట్ అవుతుందని నాకు పూర్తి నమ్మకం ఉండేది. నా అంచనాలకు మించి హిట్ అవడం నాకు చాలా సంతోషం కలిగిస్తోంది. ఈ సినిమా కాన్సెప్ట్ చాలా భిన్నంగా ఉండటంతో ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. రెండు మూడుసార్లు ఈ సినిమా చూస్తున్నారు. సినిమా అందరికీ నచ్చినందుకు నాకు చాలా సంతోషం కలిగిస్తోంది. 

కల్కి ఎడి2898 సినిమాకి సీక్వెల్‌ సిద్దం అవుతోంది. అసలు కధ దీంతోనే మొదలవుతుంది. కల్కి ఎడి2898 తీస్తున్నప్పుడే సీక్వెల్‌లోని కొన్ని ముఖ్య సన్నివేశాలు నెలరోజుల పాటు చిత్రీకరించాము. కల్కి ఎడి2898 కంటే సీక్వెల్‌ ఇంకా అద్భుతంగా ఉండబోతోంది. 

సీక్వెల్‌ల్లో ప్రభాస్‌, అమితాబ్‌ బచ్చన్‌, కమల్ హాసన్‌ మద్య వచ్చే యాక్షన్ సన్నివేశాలు హైలైట్‌గా నిలుస్తాయి. దీనిలో ఓ శక్తివంతమైన ధనస్సు కీలకంగా ఉంటుంది. సీక్వెల్‌లో యాష్కిన్ (కమల్ హాసన్‌) పాత్ర నిడివి ఎక్కువగా ఉంటుంది,” అని నాగ్ అశ్విన్‌ చెప్పారు.


Related Post

సినిమా స‌మీక్ష